కీర్తనలు

237. పరిశుద్ధాత్మ స్తుతి

రాగం: బిలహరి|తాళం: అట|రచయిత: బేతాళ జాన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమ పావురమా దురతేచ్ఛలను దూర పరచు సత్యాత్మా ||పరిశుద్ధాత్మ||
1.  నిత్యంపు వెల్గుచే నింపు జ్ఞానాత్మ సత్యంపు శుభ వార్త సంధించు నాత్మ ||పరిశుద్ధాత్మ||
2.  జీవమార్గంబున జీవింప నేర్పి త్రోవఁ దప్పిన వారి భావంబు మార్చు ||పరిశుద్ధాత్మ||
3.  పాపాంధకారంబుఁ బాపు నీ వెలుఁగుఁ జూపి మింటికి నడిపి కాపాడి మెలఁగు ||పరిశుద్ధాత్మ||
4.  భక్తుఁడు శోధింపఁ బడుచుండునేని యుక్తిఁ దెల్పెడి సర్వ శక్తి నీదౌను ||పరిశుద్ధాత్మ||
5.  తిన్ననైన తెలివి తేట నాకిమ్ము నిన్ను సేవించెద నిజము స్తోత్రమ్ము ||పరిశుద్ధాత్మ||