కీర్తనలు

239. పరిశుద్ధాత్మకొరకుఁ బ్రార్థించుట

రాగం: ముఖారి|తాళం: అట|రచయిత: తూలూరి కొర్నేలియస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే యాత్మా నడుపు ఆత్మా నీ సాయంబు నధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దై వారాధనమున ||కాత్మా||
1.  ఘోర కలుషంబుల దూరంబుగాఁ దోలి పారమార్థిక బుద్ధిఁ గోరు నట్టులను ||ఆత్మా||
2.  అంధత్వంబు వలన మందమైయుండు మా డెందంబు లెల్ల నీ యందు వెలుఁగుటకు ||ఆత్మా||
3.  నిర్మల హృదయంబు నిరతంబు మా కిచ్చి కూర్మిన్ నీ వరములఁ గూర్చి దీవించి ||ఆత్మా||
4.  సకల మానవులతో అకలంక శుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన నిక రంబు నిచ్చి ||ఆత్మా||
5.  దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మొసంగి ప్రభు సేవలోన ||ఆత్మా||