కీర్తనలు

233. క్రీస్తుని రెండవ రాకడ

రాగం: పంతువరాళి|తాళం: చాపు|రచయిత: రావూరి లక్ష్మయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వచ్చును క్రీస్తు వచ్చును భూలోకమునకు వచ్చును క్రీస్తు వచ్చును చెచ్చెరను మేఘములపె రవ మిచ్చు బూర సునాదములతో హెచ్చుగను దూతస మూహము లచ్చుగను సేవింపగ్రక్కున ||వచ్చును||
1.  అంతటను సకల భూజనులు వింతగను బూర ధ్వనియు విని నంతలోనె సజీవులై ప్రభు చెంత నిల్తు రపార మహిమను ||వచ్చును||
2.  ఒనరగనుఁదన మేఘ సింహా సనముపైఁ గూర్చుండి పావన జనుల బారుల నిరుపార్శ్వము లను విభజనముఁ జేయు నిక్కము ||వచ్చును||
3.  అదను నిది యని హృదయములు ప్రభు పదయుగళ సున్నతియెఱుంగక మద దు రేచ్ఛల గెదరు పాపుల హృదయములు చెదరి భీతిల్లఁగ ||వచ్చును||
4.  అమిత పాపాత్ముల నరకలో కమునఁ బడవైచి సుజన సమూ హముల దనవెను వెంటఁ గొని చను విమల నిత్య కిరీటము లొసఁగఁ ||వచ్చును||
5.  తల్లి పిల్లల నెడబాసియు నల్లకల్లోలముగ భువిపై తల్లడిల్లుచు నొకరి నొక్కరు నెల్లకాలము జూడని గడియ ||వచ్చును||