← కీర్తనలు

232. పాపాత్ముల యొక్క శిక్ష

రాగం: పంతువరాళి|తాళం: ఆట

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కోప దినము వచ్చును పాపుల గుండె పగులు కాలము వచ్చును శ్రీ పాల యేసుని దాపునఁ జేరక మాపు రేపులు మహ పాపులకును గొప్ప ||కోప||
1.  భువిలో రాల కర్రల పూజలఁజేయు చవి దేవుండ్లని చెప్పెడి అవిగాక తమవంటి నరులదేవుండ్లని యవివేకముగ నమ్ము నరులందరికి నెంతో ||కోప||
2.  నరహంతకులు దొంగలు వ్యభిచారులు మరి యబద్ధికు లందఱు ఇరుగు పొరుగు వారి నిఁక మోసములు చేయు నరులందఱు చెడ్డ నరకములోఁ బడునట్టి ||కోప||
3.  ఆట పాటలవల్లను పాపము చాల వేటాడుకొను వారలు బూట కముల వారలు భువిలో యక్షిణిగాండ్రు మాటలాడక యగ్ని మడుగులో బడి కాలే ||కోప||
4.  కులభేదములు గల్పించి కుటిలమందు బలముగ బ్రతుకుచుండు ఇల మాయవాదుల కిఁక నేమి గతిలేక పలుగొరుకులు నుండె బాధల పాలయ్యెడు ||కోప||
5.  మీఁది దేవునివలనను యియ్యంబడెడు వేద మొక్కటి సత్యము ఆధారమైయుండు నాత్మరక్షణ కది సాధులైనమ్మని భేదకులకు నెంతో ||కోప||