← కీర్తనలు

234. ఆయన వచ్చు వేళాయెను

రాగం: కళ్యాణి|తాళం: అట|రచయిత: చెదలవాడ తామస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు వచ్చెడి వేళాయె సోదరులారా కాశమేఘములతోను భాసురమగుతన నివాసంబునకుమనల దీసుకపోయిప్రకాశితులను జేయ ||యేసు||
1.  నిద్రమేల్కొను వేళాయె సమయము దెలిసి ఓరిమితో నుండరే భద్రముగా శత్రుయుపద్రవమును దాటి సిద్ధపడుఁడి ప్రభునియొద్ద నివసించుటకు ||యేసు||
2.  తనువును బలిపెట్టిన మన రక్షకుఁడు ఘన మహిమలోకి వెళ్లి తన యింట స్థలములు మనకు సిద్ధముఁజేసి చనుదెంచు వేళాయె కనిపెట్టి యుందాము. ||యేసు||
3.  చాలారాత్రి గతించెను సోదరులారా వెలుగు సమీపించెను వేల దూతలతోడ యేసయ్యవచ్చును కాలగురుతులగని మేలుకొనరెవేగ ||యేసు||
4.  శోధన కాలమీదే యీధరణిలో బాధలురావచ్చును నాధుఁడైన యేసుపాదముల కడనుండ యేది కీడుచేయలేదు మనపై నెపుడు ||యేసు||
5.  మనలను బ్రేమించుచూ మన పాపముల దనరక్తమున గడుగుచు ఘన దేవునికి నర్చకులనుజేసిన ప్రభుని కొనియాడి బలమహిమలను జెల్లింతుము నిరత ||యేసు||