కీర్తనలు

231. క్రీస్తు శరణు గోరుట

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: పురుషోత్తము చౌధరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి యిపుడే త్రాహి త్రాహి యనుచుఁ క్రీస్తుని దయను గోరండి ||ఓహో||
1.  అంత్యదినము నాటి బాధ లాలకించండి నరక ప్రాంతమునకుఁ బోకమునుపే ప్రభువును వేడండి ||ఓహో||
2.  మింట ప్రభువు తేజోమయమౌ మేఘారూఢుండై యగ్ని మంట వీను సింహాసనము నంటి కూర్చుండు ||ఓహో||
3.  అంధకారమగును సూర్యుఁడా దినమందు కుముద బాంధవుడు మిగుల రక్త వర్ణము నొందును ||ఓహో||
4.  కడు భీతిగ సర్వసృష్టి కంపించుచు నుండున్ భూమి కడలి యభ్రము తాపమున కరిగి పోవుచుండున్ ||ఓహో||
5.  నరక ప్రచండాగ్ని గుండ మరదై గన్పడును దానిఁ జొరక మరి యే తెరువు పాపా త్ములకు గలుగును ||ఓహో||
6.  ప్రేమతో నడిగెదను నా ప్రియబంధువులార మీర లామహా దినమందున దిరమై యట నిలువంగలర ||ఓహో||
7.  కామక్రోధ లోభమోహ గర్వగుణములను మీరు ప్రేమించి చేసితిరి గద పెక్కు విధములను ||ఓహో||
8.  కల్లలాడుచుడి ప్రొద్దుఁ గడుపుచుంటిరే యింక చిల్లర వేల్పుల పూజ చేయుచుంటిరే ||ఓహో||
9.  ప్రకటంబుగ నైన మరి గు ప్తస్థల మందైన చేయు సకల క్రియలు ప్రభువున కెఱుక సంపూర్ణముగాను ||ఓహో||
10.  జాతి గోత్రమడుగఁ బోడు సర్వేశ్వరుండు క్రియల రీతి మనసు మాత్రమె విచా రించు ప్రభువతఁడు ||ఓహో||