కీర్తనలు

202. సిలువ ధ్యానము

రాగం: సురటి|తాళం: ఆది|రచయిత: పంతగాని పరదేశి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస ||కల్వరి||
1.  సిలువపై జూడు మదేమి శ్రీ కరుడు ప్రభుయేసు స్వామి తలను ముండ్ల కిరీటంబదేమి తరచి చూడుమీ ||కల్వరి||
2.  పరులకుపకారంబు సల్ప ధరను వెలసిన వరపాదముల కఱకు మేకులు గొట్టెద రేల కరుణాలవాల ||కల్వరి||
3.  కరముపట్టి దరిని జేర్చి వరములిడి దీవించిన యా కరుణగల చేతులలో చీల గుచ్చెద రేల ||కల్వరి||
4.  ప్రేమ,కృప,నిర్మలత్వమును నీమమును గల మోముపైన పామరులుమి వేసెదరేల పాటించరేల ||కల్వరి||
5.  ఘోర యాతనలును నీదు క్రూరమరణము చూడ గుండె నీరు నీరైపోవదె దేవ క్రూరునికైన ||కల్వరి||
6.  పాపమేమిచేసి యెరుగవు పావన పరమదేవుడవు ఓ పరాత్పర నీకేమి యింత ఉత్కట బాధ ||కల్వరి||
7.  స్వామి మాకై పూటపడను నీ ప్రేమయే కారణము నిజము భూమి యది గుర్తింపగ నిమ్ము పూజ్యుండ దేవ ||కల్వరి||
8.  పావనాత్మ నీవు జావ పాపి కబ్బును నిత్యజీవ మావచన సత్యంబు దెల్పుము మానవాళికిన్ ||కల్వరి||
9.  సిలువ దరికాకర్షించుము ఖలుడను ఘోరపాపిని కలుషములు విడ శక్తినీయుము సిలువ ధ్యానమున ||కల్వరి||