← కీర్తనలు

201. యేసు శాంతికరుడు

రాగం: శ్యామ|తాళం: ఆది|రచయిత: చెట్టి భానుమూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో పలుశ్రమ లొందినీ ప్రాణము బెట్టితి ||కల||
1.  తులువలుజేరినిన్ తలపడి మొత్తిరో అలసితి సొలసితి నాత్మను గుందితి ||కల||
2.  పాపులకొరకై ప్రాణముబెట్టితి ప్రేమ ది యెట్టిదో నామదికందదు ||కల||
3.  దారుణ పాప భారము మోసితి దీనుల రక్షణ దానమైతివి గద ||కల||
4.  జనకున భీష్టమున్ జక్కగ దీర్చితి జనముల బ్రోవనీ జీవము నిచ్చితి ||కల||
5.  శాంతిని గోరి ది శాంతముల్దిరిగిన భ్రాంతియె గాని వి శ్రాంతెవరిత్తురు? ||కల||