కీర్తనలు

200. స్త్రీలు సిలువచెంత ధ్యానించుట

రాగం: సారంగ|తాళం: త్రిపుట

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చేడియలు గుంపుగూడిరి క్రీస్తు జాడఁ గని తాల్మి నీడిరి ఆడికలనోర్చి నేఁడు మన పాఁలి వాఁడుసిలువ ను న్నాడు గదె యంచు ||చేడియలు||
1.  వారి మొగములు వాడెను యేసు వారి వెత లెల్ల జూడను నీరు దృక్సర సీరుహములందు జార తమ కొన గోరులను మీటి ||చేడియలు||
2.  రొమ్ములను జేతు లుంచుచు చింత గ్రమ్మి నిట్టూర్పు లిచ్చుచు కొమ్మలట నిల్పు బొమ్మలన చేష్ట లిమ్ముచెడి యబ్బు రమ్ముతో నిల్చి ||చేడియలు||