కీర్తనలు

199. క్రీస్తు సిలువయే మన మహిమ

రాగం: ఆనందభైరవి|తాళం: కురుజంపె|రచయిత: విలియం డాసన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సిరులెల్ల వృధ కాఁగఁ పరికించి నాకున్న గురువముఁ దిరస్కరింతున్ వెర మహిమ రారాజు మరణాద్భుతపు సిలువ నరయుచున్నట్టి వేళన్ ముఖ్యము లైన ||సిరు లెల్ల||
1.  ఓ కర్త నా దేవుఁ డౌ క్రీస్తు మృతియందుఁ గాక మరి మురియ నీయకు ప్రాకట భ్రమకారి వ్యర్ధ వస్తువులను ప్రభుని రక్తంబు కొరకై త్యజించెదను ||సిరు లెల్ల||
2.  చారు మస్తక హస్త పాదములవలన వి చారంబు దయయుఁ గలసి సారెఁ బ్రవహించుచున్నది చూడు మెపుడిట్టి దారి గలదా ముళ్లు తగు కిరీటం బౌన ||సిరు లెల్ల||
3.  వాని నిజ రక్తంబు వస్త్రంబువలె సిలువ పై నతని తనువు గప్పె ఐననేనీ లోక మంతటికి మృతుఃడనై తిని నా కీ లోకము మృతంబయ్యె ||సిరు లెల్ల||