← కీర్తనలు

195. క్రీస్తు శ్రమల ధ్యానము

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: గొల్లపల్లి నతానియేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎన్నఁడు గాంచెదమో యేసుని నెన్నఁడు గాంచెదమో యెన్నఁడు జూతుము కన్నె కుమారుని సన్నుతి జేయుచును ||నెన్నఁడు||
1.  అంధుల గాచె నఁట యెహోవా నందనుఁ డితఁడౌనట పొందుగఁ బాపాత్ములకొర కై తన ప్రాణము విడిచెనఁట ||యెన్నఁడు||
2.  వేసిరి సిలువనఁట క్రీస్తుని జేసిరి హేళనఁట డాసిరి యూదులఁట బల్లెము దూసిరి ప్రక్కనఁట ||యెన్నఁడు||
3.  చిందెను రక్తమఁట పరమ సంధులు దెల్పెనఁట నిందల కోర్చె నఁ ట మన దగు నేరము గాచెనఁట ||యెన్నఁడు||
4.  ఆపద కోర్చెనఁట పాపపు మోపులు మోసెనఁట కోపము మాన్పెనఁ ట యెహోవా కొడుకై వెలసెనఁట ||యెన్నఁడు||
5.  అక్షయుఁ డితఁడెనఁట జగతికి రక్షకుఁ డాయెనఁట దీక్షగ నమ్మిన నరులం దరికి ని రీక్షణ దేవుఁడఁట ||యెన్నఁడు||