← కీర్తనలు

194. యేసు పై మనదోషము మోపబడెను

రాగం: సావేరి|తాళం: ఆది|రచయిత: జుటిక దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది నా దోసమే దుస్సహ వాసమే ||యేసు||
1.  కంటక కిరీట మౌదల నంటగొట్టించినది నాచెడు తలఁపులే పాపపు పలుకులే ||యేసు||
2.  మృదుకరంబుల మేకులందింపి నదితలఁప నా హస్తకృత కా ర్యంబులే దుష్క ర్మంబులే ||యేసు||
3.  పాదయుగమున నాటిచీలలు బాధ నొందించినది నా చెడు నడకలే దోసపు పడకలే ||యేసు||
4.  దాహముం గొనఁజేదు చిరకను ద్రావదలఁచినది మధుపానా సక్తియే యందను రక్తియే ||యేసు||
5.  హెచ్చుగ లోహిత పతనముగఁ గ్రుచ్చిన కుంతంబు నా పా పేచ్ఛలే హృదయదు రేచ్ఛలే ||యేసు||
6.  పావనగాత్రంబు క్షతమయ మై వెతలపాల్జేసినది నా దేహమే యఘ సం దోహమే ||యేసు||
7.  దీనిఁగని నా మానసాబ్జము లోని కలుషము దూరపర్చక నడుతునా ధారుణిఁ గడుతు నా ||యేసు||