← కీర్తనలు

196. క్రీస్తు సిలువమీఁద పల్కిన యేడు మాటలు

రాగం: హిందుస్థాని కాపి|తాళం: రూపకము|రచయిత: పంతగాని పరదేశి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను నా దోషమేగదా ||యాహా||
1.  "వీరలను క్షమించు తండ్రి నేర రేమియున్" కోరి తిటులు నిన్నుఁ జంపు క్రూరజనులకై ||యాహా||
2.  "నీవు నాతోఁ బరదైనున నేఁడె యుందువు" పావనుండ యిట్లుఁ బలికి పాపిఁ గాచితి ||వాహా||
3.  "అమ్మా! నీ నుతుఁడ" టంచు మరి యమ్మతోఁ బలికి క్రమ్మర "నీ జనని" యంచుఁ గర్త నుడివితి ||వాహా||
4.  "నా దేవ దేవ యేమి విడ నాడితి" వనుచు శ్రీదేవ సుత పలికితివి శ్రమ చెప్పశక్యమా ||యాహా||
5.  "దప్పికొనుచున్నా న" టంచుఁ జెప్పితివి గద యిప్పగిదిని బాధ నొంద నేమి నీకు హా! ||యాహా||
6.  శ్రమ ప్రమాదములను గొప్ప శబ్ద మెత్తి హా "సమాప్తమైన" దంచుఁ దెలిపి సమసితివి గదా ||యాహా||
7.  "అప్పగింతుఁ దండ్రి నీకు నాత్మ" నంచును గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా ||యాహా||