← కీర్తనలు

193. సిలువమీఁది క్రీస్తు

రాగం: హిందుస్థాని కాపి|తాళం: త్రిపుట|రచయిత: ఒంగోలు అబ్రహాము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు జెందెఁ గదా ||చూడరే||
1.  నా చేతలు చేసినట్టి దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే||
2.  దురితంపు దలఁపులే పరమగురిని శిరముపై నెనరు లేక మొత్తెనయ్యో ముండ్ల కిరీటమై ||చూడరే||
3.  పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమ రక్షకుని పాదములలో మేకులు ||చూడరే||
4.  పాపేచ్ఛ తోడఁ గూడు నాదు చెడ్డ పడకలే పరమగురుని ప్రక్కలోని బెల్లంపు పోటులు ||చూడరే||