కీర్తనలు

172. యేసే మన సమస్తము

రాగం: నవరోజు|తాళం: ఆది|రచయిత: గొల్లపల్లి నతానియేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసుక్రీస్తు దొరికె నేని యేమికొదువింకేమి భయము దోసకారి జనుల కెంతోఁ గ్రాసమవునా యేసు పేరు ||యేసు||
1.  తల్లిదండ్రులకన్న చాలాఁ దన ప్రేమ మనమీద నెల్లకాలమందు నుంచు యేసుఁడే మా తండ్రియౌను ||యేసు||
2.  వల్లగాని వశములేని యెల్ల మేళ్లన్నిటి నెల్లపుడు కొల్లగా మన కిచ్చెడి దేవ కొమరుఁడే వేరెవరు లేరు ||యేసు||
3.  దండియైన గండములు మెండుగాను మముఁజుట్టిన తండ్రివలె మా దరికి వచ్చి గండములను గదిమిఁ బ్రోచున్ ||యేసు||
4.  సత్యము మార్గముతానె నిత్యజీవమింకా తానే భ్రుత్యుల మనకీయ మోక్షము భువిని రక్తమంత గార్చె ||యేసు||
5.  ఎన్నరాని పాపాత్ముల కన్నులారా కనికరించి పున్నెమైన తన ప్రాణము భువిని బలిపెట్టినాఁడు ||యేసు||
6.  ఒడలు నిండా గాయములతో నడరు చుండమరల లేచి వెడలి పరమందునుండి వేడుకలు మాకంపినాఁడు ||యేసు||
7.  ఆశతోడఁ తన్ను నమ్ము యాత్మలకు దర్శనమిచ్చెడి యేసుతో నింకెవరు సాటి లేశమైనా లేరుసుండీ ||యేసు||