← కీర్తనలు

171. యేసుని గొప్ప ప్రేమ

రాగం: ముఖారి|తాళం: త్రిపుట|రచయిత: బేతాళ జాన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు||
1.  నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దా నముగా జీవము సిల్వపై నిచ్చి కన్న తలిదండ్రుల యన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో ||యేసూ||
2.  తల్లి గర్భమున నే ధరియింపఁబడి నపుడే దురితుండనై యుంటిని నా వల్లజేఁయఁబడెడు నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండఁగ ||యేసూ||
3.  మంచి నాలోఁ పుట్ట దంచు నీ వెరిఁగి నన్ మించఁ బ్రేమించి నావు ఆహా యెంచ శక్యముగాని మంచి నాలోఁ బెంచ నెంచి ప్రేమించినావు ||యేసూ||
4.  నన్నుఁ బ్రేమింప నీ కున్న కష్టము లన్ని మున్నై తెలిసియుంటివి తెలిసి నన్నుఁ బ్రేమింప నీ కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము ||యేసూ||
5.  నా వంటి నరుఁ డొకఁడు నన్నుఁ ప్రేమించిన నావలన ఫలముఁ గోరు ఆహా నీవంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలంబేమి లేక ||యేసూ||