కీర్తనలు

145. యేసే మార్గము

రాగం: మోహన|తాళం: మిశ్రచాపు|రచయిత: ముంగమూరి దేవదాసు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీవేయని నమ్మక యేసునాకు నీవేయని నమ్మిక నీవే మార్గంబు నీవే సత్యంబు నీవే జీవంబు నీవే సర్వంబు ||నీవే||
1.  పెడదారిని బోవగ నామీదికి ఇడుమలెన్నియొరాగ అడవిలోబడి నేను ఆడలుచు నుండగ తడవకుండ దొరుకు ధన్యుమౌ మార్గంబు ||నీవే||
2.  కారుమేఘముపట్టగ నా మనస్సులో కటిక చీకటిపుట్టగ ఘోరాపదలుచేరి దారియని భ్రమపడగ తేరిచూడగల్గు తేజోమయ మార్గంబు ||నీవే||
3.  లేనిపోని మార్గంబు లెన్నోయుండ జ్ఞానోపదేశంబు మానుగజేయుచు వానినిఖండించి నేనే మార్గంబన్న నిజమైన మార్గంబు ||నీవే||
4.  నరలోకమునుండి పరలోకంబు వరకు నిచ్చెనగా నుండి నరులకు ముందుగా నడుచుచు ముక్తికి సరిగా కొనిపోవు సు స్థిరమైన మార్గంబు ||నీవే||