← కీర్తనలు

144. యేసే సర్వాధిపతి

రచయిత: రావూరి రత్నము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి క్రీస్తే ఆ సిల్వధారి ||
1.  ముక్తి విధాతనేత శక్తి నొసంగుదాత భక్తి విలాపశ్రోత పరమంబు వీడె గాన ||క్రీ||
2.  దివ్యపథంబురోసి దైవంబు తోడుబాసి దాసుని రూపుదాల్చి ధరణి కేతెంచెగాన ||క్రీ||
3.  శాశ్వత లోకవాసి సత్యామృతంపురాశి శాప భారంబు మోసి శ్రమల సహించెగాన ||క్రీ||
4.  సైతాను జనము గూల్పన్ పాతాళమునకు బంపన్ నీతి పథంబు బెంప రుధిరంబు గార్చెగాన ||క్రీ||
5.  మృత్యువు ముల్లు తృంపన్ నిత్యజీవంబు బెంపన్ మర్త్యాళిభయము దీర్పన్ మరణంబు గెలిచెగాన ||క్రీ||
6.  పరమందు దివిజులైన ధరయందు మనుజులైన ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగాన ||క్రీ||
7.  ఈ నామమునకు మించు నామంబు లేదటంచు యెహోవా తండ్రి యేసున్ హెచ్చించినాడు గాన ||క్రీ||