← కీర్తనలు

146. క్రీస్తే రారాజు

రాగం: శంకరాభరణం|తాళం: ఆది|రచయిత: ఎ. చార్లెస్ కిన్సింగర్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
క్రీస్తేసు శక్తినామమెల్లరు కీర్తించి కొల్వుడిలన్ యెపుడు కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||
1.  సాష్టాంగపడి దూతల్ పరమున నిష్ఠతో గొలుచుచును యేసుని కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||
2.  హతసాక్ష్యపు జనమా యేసుడె హితమతితో బిలుచున్ మిమ్ముల కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||
3.  ఇశ్రాయేల్ ప్రజలారా యిచ్చెను ఆశ్రయ రక్షణను యేసుడే కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||
4.  పాపుల రక్షించెన్ సిలువపై శాపము దొలగించెన్ యేసుడే కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||
5.  సర్వజనంబులారా క్రీస్తుని సర్వజగంబులలో ఠీవిగ కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||
6.  పరమందున్నట్టి ప్రభుదగు పరిశుద్ధ సంఘముతో మనము కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తు నారాధింతము ||క్రీస్తే||