← కీర్తనలు

142. యేసు నామస్మరణ

రాగం: హిందుస్థాని కాపి|తాళం: రూపకము|ఛాయ: ఆహ మహాత్శ్క హో శరణ్య|రచయిత: వంతగాని పరదేశి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
శ్రీ యేసు దివ్య నామస్మరణ చేయవే మనసా పాయక స్మరియించి పరము పొందువే మనసా ||శ్రీ||
1.  నరుల పాప హరణమునకై నరుడయ్యె మనసా పరమ పుర ద్వారంబు మనకు తెరచెనే మనసా ||శ్రీ||
2.  నరుల పాప శాప ఫలము నరకమే మనసా ఆ మరణమును తొలంచప్రభువే నుడిసె నేమనసా ||శ్రీ||
3.  పాపమునకు ప్రాయశ్చిత్తం భవ్యమే గదా ప్రభువే ప్రాయశ్చిత్త బలియై పరగెనే మనసా ||శ్రీ||
4.  సిలువవేసి ప్రభుని ప్రజలు చంపిరే మనసా ఆ బలుడు తిరిగి లేచి మృతిని గెలిచేనే మనసా ||శ్రీ||
5.  గెలిచి యేసు హితులమధ్య నిలిచెనే మనసా నిలిచి సమాధాన మంచు పలికెనే మనసా ||శ్రీ||
6.  పునరుత్థాన మేసు దేవ పుత్రుడని మహా ఘనముగా ప్రకటించుచుండ కాననే మనసా ||శ్రీ||
7.  తానె మార్గం తానెసత్యం తానెజీవము ఈ ఘన సత్యంబు నమ్మునరులు ధన్యులే మనసా ||శ్రీ||
8.  నిన్ను నీ వెరింగి ప్రభుని నెరుగ వే మనసా సన్నుతు డందుల కొసంగె సత్యవేదము ||శ్రీ||
9.  పాపములకు పరితపించి ప్రభుని జేరవే దాపునకు రమ్మంచు కరము చాపేనే మనసా ||శ్రీ||
10.  ఎంత ఘోరపాపమైన నెంచడే మనసా ఎంత మొత్తమైనను క్షమి యించునే మనసా ||శ్రీ||
11.  బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించు మనసా ఈ బతుక్నందె ప్రభుని పదము పట్టుకో మనసా ||శ్రీ||
12.  జనక కుమారాత్మ దేవున్ జపియించు మనసా అనయమును స్మరించు స్వర్గ మద్దియే మనసా ||శ్రీ||