పల్లవి:
వరనామమే శరణము శరణము క్రీస్తు వరనామమే శరణము శరణం ||వర||
1. పరమభక్త వ్రాత దురిత సంఘాత దు స్తర వన జాత భీ కరకీలి యౌ క్రీస్తు ||వర||
2. సారహీన సం సార పారావార తారణ కారణ తరణి యైన క్రీస్తు ||వర||
3. యూద దేశమునందు నుండు బేత్లేహేమున యూదు లను జనులలో పాదుకొన్న క్రీస్తు ||వర||
4. ఇలలో పాపపు మాన వుల నెల్ల మోక్ష సం కలితులఁ జేయుఁగ సిలువ నొందిన క్రీస్తు ||వర||
5. ఏచియున్నట్టి పి శాచభారపు కాడి మోసి దుఃఖించెడు నీచులకును క్రీస్తు ||వర||
6. కొల్లగాను బాప మెల్లఁ జేసి దాని కుల్లములోఁదల్ల డిల్లువారికిఁ క్రీస్తు ||వర||
