← కీర్తనలు

125. సుమెయోను పాట

రాగం: శంకరాభరణము|తాళం: త్రిపుట|ఛాయ: నాకాలగతు లెప్పు|రచయిత: నమూయేలు పాక్యవాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీ సమాధానము దాసుని కిప్పుడు నాధా దేవా యిచ్చి నీ మాటచొప్పున పోనిచ్చుచున్నావు నాధా దేవా ||నీ సమాధానము||
1.  అన్యులకు నిన్ను బయలు పరచెడి వెలుగుఁగాను నీకు నణఁగు ప్రజలైన యిశ్రాయేల్ వారికి మహిమ గాను ||నీ సమాధానము||
2.  నరులకై నీవు ఏ ర్పరచిన రక్షణన్ నాధా దేవా యిదిగో నాకనులు చూచి యా నందించుచున్నవి నాధా దేవా ||నీ సమాధానము||
3.  తండ్రికి సుతునికిఁ బరిశుద్ధాత్మకును గలుగుగాక మహిమ తరుగక సదాకాలము యుగయుగములకును గలుగు నామేన్ ||నీ సమాధానము||