కీర్తనలు

124. కన్య మరియ పాట

రాగం: హిందుస్థాని తోడి|తాళం: ఆది|రచయిత: భవవాసి నమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ నంబు చేయుచున్నది నాదు నాత్మ దేవునం దా నం మొందెను నిరతము ||నాదు||
1.  దేవుఁడు తన భృత్యురాలి దీనస్థితి లక్షించెను ఈ వసుంధరఁ దరము లన్నిఁక నెన్ను నను శుభవతి యని ||నాదు||
2.  సర్వ శక్తుఁడు మహాకృత్యము సంభవింపఁ జేసెను ఉర్విలో నా ప్రభుని నామం బోప్పు బరిశుద్ధంబుగా ||నాదు||
3.  భయము భక్తియుఁ గల్గి దేవుని భజనఁ జేసెడి వారికి నయముగాఁ దన కృప నొసంగు న నయమును దరతరములు ||నాదు||
4.  విదిత బాహువు చేత శౌర్యము విభుఁడు కనపర్చెను హృదయపుఁ దలఁపులను గర్వులఁ జెదరఁ గొట్టెను నిజముగ ||నాదు||
5.  ఆసనాసీనులై యున్న యతిశయాత్ములన్ బడఁ ద్రోసి దేవుఁడు దీనులను సిం హాసనంబుల నునిచెను ||నాదు||
6.  క్షుధితులను దన మధురములచేఁ గోరి తృప్తి పర్చెను అధిక ధనవంతులను రిక్త హస్తములతో ననిపెను ||నాదు||
7.  ఆది పితరులైన యబ్రా హాము కతని సంతున కద్వితీయుఁ డాదిలోక నాన తిచ్చినట్లుగా ||నాదు||
8.  నిరతమును దన కరుణఁ జూప నిజముగా మది నెంచెను వరదుఁ డిశ్రాయేలునకుఁ దన వర సహాయ మొనర్చెను ||నాదు||
9.  పరమ తండ్రికి దైవ సుతునకు పావనాత్మకు నిఁక నిహ పరమ లందును యుగయుగంబులఁ బరఁగు మహిమ మామేన్ ||నాదు||