← కీర్తనలు

123. జెకర్యా పాట

రాగం: బ్యాగు|తాళం: ఆది|రచయిత: మల్లెల దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్తుతి నొందును గాక యాశ్రితువౌ తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించె ||నిశ్రా||
1.  తన దాసుఁడు దావీదు గృహంబున ఘన రక్షణ శృంగము నిచ్చె మన శత్రువు లగు ద్వేషులనుండియు మనలన్ బాపి రక్షణ నిచ్చె ||నిశ్రా||
2.  దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుఁడు పలికించెను దొల్లి మానవ మన పితరులఁ గరుణింపఁగ మహిలోన నిబంధనఁ జేసె ||నిశ్రా||
3.  జనకుం దగు నబ్రాహాముతోఁ జేసిన యా ప్రమాణముఁ దలఁచి మనము విరోధులనుండి విమోచన గని నిర్భయులమై మెలఁగ ||నిశ్రా||
4.  ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగ నీతిగ నుండఁ పాయక తన సేవను నిత్యంబును జేయఁగ నీ రక్షణ నిచ్చె ||నిశ్రా||
5.  ధర నో శిశువా దేవుని దీర్ఘ దర్శి వనెడు పేరొందెదవు పరమేశ్వరుని వాత్సల్యతతోఁ పాపవిముక్తిఁ బ్రజ లొంద ||నిశ్రా||
6.  మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ మార్గము సిద్ధపరచుటకై దీన మనస్సుతోఁ బ్రభునకు ముందు గా నడిచెదవు భయభక్తి ||నిశ్రా||
7.  మరియును సమాధాన సరణిలో మన మీఁక నడువఁ జీఁకటిలో మరణచ్ఛాయలో నుండిన వారికి నరుణోదయ దర్శన మిచ్చె ||నిశ్రా||
8.  జనక పుత్రాత్మ దేవుని కిలలో ఘనత మహిమ కల్గును గాక మును పిపు డెప్పుడు తనరి నట్లు యుగ ములకును దనరారునుగా కామేన్ ||నిశ్రా||