← కీర్తనలు

122. క్రీస్తుని మహిమ

రాగం: మధ్యమావతి|తాళం: అట|రచయిత: తిరుకోవళ్లూరి స్టీవెన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
లాలిలాలి లాలి లాలమ్మ లాలీ లాలియని పాడరే బాలయేసునకు ||లాలి||
1.  పరలోక దేవుని తనయుఁడో యమ్మా పుడమిపై బాలుఁడుఁగఁ బుట్టెనో యమ్మా ||లాలి||
2.  ఇహ పరాదుల కర్త యీతఁడో యమ్మ మహి పాలనముఁ జేయు మహితుఁడో యమ్మా ||లాలి||
3.  ఆద్యంతములు లేని దేవుఁడో యమ్మా ఆదాము దోషమున కడ్డు పడె నమ్మా ||లాలి||
4.  యూదులకు రాజుగాఁబుట్టెనో యమ్మా యూదు లాతని తోడ వాదించి రమ్మా ||లాలి||
5.  నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా ||లాలి||