కీర్తనలు

121. యేసుని జననము

రాగం: ముఖారి|తాళం: అట|రచయిత: కొమ్ము కృప

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
శ్రీ యేసుండు జన్మించె రేయిలో నేఁడు పాయక బెత్లెహేమ యూరిలో ||శ్రీ యేసుండు||
1.  కన్నియ మరియమ్మ గర్భమందున ని మ్మాను యేలనెడి నామమందున ||శ్రీ యేసుండు||
2.  సత్ర మందునఁ బశువుల సాలయందున దేవ పుత్రుండు మనుజుం డాయెనందున ||శ్రీ యేసుండు||
3.  పట్టి పొత్తిగుడ్డలతోఁ జుట్టఁబడి పసుల తొట్టిలోఁ బరుండబెట్టఁబడి ||శ్రీ యేసుండు||
4.  గొల్లలెల్లరు మిగుల భీతిల్లఁగ దెల్పె గొప్ప వార్త దూత చల్లఁగ ||శ్రీ యేసుండు||
5.  మన కొఱకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషములఁ బోఁగొట్టను ||శ్రీ యేసుండు||
6.  పరలోకపు సైన్యంబుఁ గూడెను మింట వర రక్షకుని గూర్చి పాడెను ||శ్రీ యేసుండు||
7.  అక్షయుండగు యేసు వచ్చెను మనకు రక్షణంబు సిద్ధపర్చెను ||శ్రీ యేసుండు||