← కీర్తనలు

120. రక్షకుని రాక

రాగం: యదుకుల కాంభోజి|తాళం: ఆది|రచయిత: జాన్ చౌధరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు బెత్లెహేములో నేఁడీ భూమి వాసులకు నిండు రక్షణబ్బెను ||చూడరే||
1.  ఎన్నరాని దేవ దీప్తి మున్ను మిన్ను గ్రమ్మెను పన్నుగా రేయెండ కాంతి కన్ననది మించెను ||చూడరే||
2.  దూత తెల్పె వ్రేల కొక ప్రీతియగు ముచ్చటన్ ఖ్యాతిగ దావీదు పురిని కర్తయేసు పుట్టుటన్ ||చూడరే||
3.  తూరుపున జ్ఞానులొక్క తార దివిని గాంచిరి వారు వీరు వచ్చి సేవ వరుసగాను జేసిరి ||చూడరే||
4.  మక్కువతో మనమెల్ల మ్రొక్కి సేవఁ జేతుము మిక్కుటముగ మనకు శాంతిఁ గ్రక్కున నొసంగును ||చూడరే||