← కీర్తనలు

117. క్రిస్మసు వర్తమానము

రాగం: రేగుప్తి|తాళం: ఏక|రచయిత: మత్తయి నమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసునాధుని యోధులందరు వాసిగ నిటరండు వేగమె వాసిగ నిటరండు భాసురముగ ప్రభు జన్మము బాడుచు నాసతోడ రండు వేగమె యాసతోడ రండు ||జే జయం||
1.  దూతలమాదిరి గాత్రము లెత్తుచు గీతము బాడుండి వేగము గీతము బాడుండి దాతయౌ మన క్రీస్తుని నీతిని ఖ్యాతిగ బలుకుండి వేగమె ఖ్యాతిగ బలుకుండి ||జే జయం||
2.  గొల్లల ప్రభు కడకేగిన రీతిని నెల్లరు నడువుండి వేగమె యెల్లరు నడువుండి ఉల్లములందున సంతసించి ప్రభు నెల్లెడ దెలుపుండి వేగమె యెల్లడ దెలుపుండి ||జే జయం||
3.  జ్ఞానుల భంగిని మానవులందరు కానుక లియ్యుండి వేగమె కానుక లియ్యుండి మానవకోటికి రక్షణ భాగ్యము దానము బొందుండి వేగమె దానము బొందుండి ||జే జయం||
4.  మరియ రీతిగను మనసు లోపలను మురియుచు నుండుండి వేగమె కానుక లియ్యుండి మానవకోటికి రక్షణ భాగ్యము దానము బొందుండి వేగమె దానము బొందుండి ||జే జయం||
5.  జయజయ శబ్దము జేయుచు ప్రభునకు జయమని పాడుండి వేగమె జయమని పాడుండి జయజయ మంచును జయ శబ్ధముతో జయముల నొందుండి వేగమె జయముల నొందుండి ||జే జయం||