← కీర్తనలు

118. బాలయేసు దర్శనము

రాగం: జంఝూటి|తాళం: ఆది

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మేము వెళ్లిచూచినాము స్వామి యేసుక్రీస్తును ప్రేమ మ్రొక్కి వచ్చినాము మా మనంబులలరగ ||మేము||
1.  బేదలేము పురములోన బీద కన్యమరియకుఁ బేదగా సురూపుఁ దాల్చి వెలసెఁ బశులపాకలో ||మేము||
2.  జ్ఞానులమని గర్వపడక దీనులమై నిత్యము వాని ప్రేమ సకల ప్రజకు మానక ప్రకటింతుము ||మేము||
3.  తద్దరిశనమందు మాకుఁ బెద్ద మేలు గలిగెగా హద్దులేని పాపమంత రద్దుపరచబడెనుగా ||మేము||
4.  మరణమెపుడొ రేపొమాపో మరియెపుడో మన మెరుగము త్వరగా పోయి పరమగురుని దరిశనంబుఁ జేతము ||మేము||
5.  హరిశుద్ధాత్మ జన్మ మాకు వరముగా నొసంగెను పరమపురము మాకు హక్కు పంచెదాను నిరతము ||మేము||
6.  మాకు సర్వగర్వమణిగి మంచి మార్గమబ్బెను మాకు నీ సువార్తఁ జెప్ప మక్కువెంతోఁ గలిగెను ||మేము||