← కీర్తనలు

116. రారాజు జన్మదినము

రాగం: హిందుస్థాని తోడి|తాళం: ఆది|రచయిత: చెట్టి భానుమూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను రాజులకు రా రాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో ||రారె||
1.  దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున ||రారె||
2.  కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం తెల్లగానదె తేజరిల్లెడి తారగాంచరె త్వరగ రారే ||రారె||
3.  బాలు డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు బాల బాలికా బాలవృద్ధుల నేల గల్గిన నాధుడు ||రారె||
4.  యూద వంశము ను ద్ధరింప దా వీదుపురమున నుద్భవించె సదమలంబగు మదిని గొల్చిన సర్వ జనులకు సార్వభౌముడు ||రారె||