← కీర్తనలు

110. మెస్సీయా జన్మము

రాగం: హరికాంభోజి|తాళం: త్రిపుట|రచయిత: ఫేలిక్స్ ఆండ్రు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పుట్టె యేసుఁడు నేఁడు మనకు పుణ్యమార్గము జూపను పట్టి యయ్యెఁ బరమ గురుఁడు ప్రాయశ్చిత్తుఁడు యేసుడు ||పుట్టె||
1.  ధరఁ బిశాచిని వేఁడిన దు ర్నరులఁ బ్రొచుటకై యా పరమవాసి పాపహరుఁడు వరభక్త జన పోషుఁడు ||పుట్టె||
2.  యూద దేశములోను బేత్లె హేమను గ్రామమున నాదరింప నుద్భవించె నధములమైన మనలఁ ||బుట్టె||
3.  తూర్పు జ్ఞానులు కొందఱు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియు కొమరుని కర్పణము లిచ్చిరి ||పుట్టె||