← కీర్తనలు

109. కరుణగల రక్షకుడు

రాగం: బిలహరి|తాళం: త్రిపుట|రచయిత: ఎన్.డి. ఏబెల్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చింత లేదిఁక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునఁ చెంత జేరను రండి సర్వజనాంగమా సంతస మొందుమా ||చింత||
1.  దూత తెల్పెను గొల్లలకు శుభ వార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరఁగ వారు యేసును గాంచిరి స్తుతు లొనరించిరి ||చింత||
2.  చుక్కఁ గనుగొని జ్ఞాను లెంతో మక్కువతో నా ప్రభుని గను గొన చక్కఁగా బెత్లెముపురమున జొచ్చిరి కానుక లిచ్చిరి ||చింత||
3.  కన్యగర్భమునందుఁ బుట్టెను కరుణగల రక్షకుఁడు క్రీస్తుఁడు ధన్యులగుటకు రండి వేగమె దీనులై సర్వమాన్యులై ||చింత||
4.  పాప మెల్లను పరిహరింపను పరమ రక్షకుఁ డవతరించెను దాపుఁ జేరిన వారి కిడుఁ గడు భాగ్యము మోక్షభాగ్యము ||చింత||