కీర్తనలు

111. మెస్సీయా జన్మము

రాగం: ఆనందభైరవి|తాళం: త్రిపుట|ఛాయ: వచ్చి గాబ్రియేల పల్కెను|రచయిత: ఎస్. జేమ్స్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు పురమున నుద్భువించెను వేడుకతోడను బాడుఁడి పాటలు రూఢిగ సాతాను కాడిని దొలఁగింప ||ఱేఁడు||
1.  మనకొఱకై శిశువు పుట్టెను అతఁడు మన దోషములను బోగొట్టెను అనయంబు నతనిమీఁ దను రాజ్యపు భార ము నుంచఁబడె విమో చనకర్త యితఁ డౌను ||ఱేఁడు||
2.  పరలోక సైన్యంబు గూడెను మన వర శిశువును గూర్చి పాడెను నరులయందున గరుణ ధర సమాధానంబు చిర దేవునికి బహు మహిమ యటంచును ||ఱేఁడు||
3.  కొమ్మ యెష్షయినుండి పుట్టెను చిగురు క్రమ్మర మొద్దున బుట్టెను కమ్మొను దేవుని యా త్మమ్మును తెలివి జ్ఞా న మ్మలోచన మహ త్వ మ్మొక్కుమ్మడినాతని ||ఱేఁడు||
4.  సర్వశక్తి గల దేవుఁడు మరియు నుర్వియందు దయాస్వభావుఁడు సర్వమహిమము గల్గు స్వర్గ లోకము వదలి గర్వముతో నిండిన సర్వంసహా స్థలిపై ||ఱేఁడు||
5.  వింతైన వాఁడుగ నుండెను కోరినంత సుందరత లేకుండెను చింతతోడను మాయా సంగతులగు వారి యంతములేనట్టి యాపదను వీక్షించి ||ఱే ఁడు||
6.  చెదరిన గొఱ్ఱెల వెదకును వాని ముదమున మందలోఁ జేర్చును సదయత యేసుండు జనితైక సుతుఁడు భా స్వదధిక విభుఁడాలో చన కర్త జన్మించె ||ఱేఁడు||
7.  అక్షయుండగు యేసు వచ్చెను మన రక్షణమ్మును సిద్ధపర్చెను మోక్షము సరుణా క టాక్షమ్ముతో నియ్య నీక్షితియందున హెబ్రీ వంశమునందు ||ఱేఁడు||