← కీర్తనలు

108. బాలయేసునకు స్వాగతము

రాగం: కమాసు|తాళం: త్రిపుట|రచయిత: వంతగాని పరదేశి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కొనియాడఁ దరమె నిన్ను కోమల హృదయ కొనియాడఁ దరమె నిన్ను తనరారు దినకరుఁ బెనుతారలను మించు ఘనతేజమున నొప్పు కాంతిమంతుఁడ వీవు ||కొనియాడ||
1.  ఖెరుబులు సెరుపులు మరి దూతగణములు నురుతరంబుగఁ గొలువ నొప్పు శ్రేష్ఠుఁడ వీవు ||కొనియాడ||
2.  సర్వలోకంబులఁ బర్వు దేవుఁడ వయ్యు నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితి వీవు ||కొనియాడ||
3.  విశ్వమంతయు నేలు వీరాసనుఁడ వయ్యుఁ పశ్వాళితోఁ దొట్టిఁ పండియుంటివి నీవు ||కొనియాడ||
4.  దోసంబులను మడియు దాసాళిఁ గరుణించి యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు ||కొనియాడ||
5.  నరులయందునఁ గరుణ ధర సమాధానంబు చీకాలమును మహిమ పరఁగఁ జేయుదు వీవు ||కొనియాడ||
6.  ఓ యేసు పాన్పుగ నా యాత్మఁ జేకొని శ్రేయముగ బవళించు శ్రీకర వరసుత ||కొనియాడ||