← కీర్తనలు

107. 'నేడు రక్షకుడు మీకు పుట్టీయున్నడు'

రాగం: సురటి|తాళం: త్రిపుట|రచయిత: పురుషోత్తమ చౌదరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయించినాఁడు విదితయౌ మరియ నందనుఁడై యిమ్మానుయేల్ సదయుఁడై చెడియున్న పృథివికి నొదవ సమ్మద మల పిశాచికి మద మణంగను సాధు జనముల హృదయముల ముద మెదుగునట్లుగ ||నుదయించి||
1.  ఏ విభునివలన నీ జగ మయ్యె నా విభుఁ డీయిలను దైవత్వమగు మను ష్యావతారముఁ దాల్చె జీవులకు జీవనముపై తగ దేవుఁడును దా నొక్కఁడు చిర జీవియగు ప్రభు పాపి జీవులఁ గావఁ దనుఁ జావునకు నొడఁబడి ||యుదయించి||
2.  యూదుల నడుమన్ బెక్కగు భేదా భేదముల్ బొడమన్ వాదించి ప్రభు రాకఁ గాదంచు మది నెంచి మీదుఁ జూడని వారి కారుండ వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘనుఁ డౌ దయాళుఁడు ప్రాణ మీడుటకు ||నుదయించి||