← కీర్తనలు

106. దూత మరియను దర్శించుట

రాగం: ఆనందభైరవి|తాళం: త్రిపుట|రచయిత: పురుషోత్తమ చౌదరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వచ్చిగాబ్రియేలు పల్కెను మరియ మచ్చకంటిడెంద ముల్కెను హెచ్చైన శుభముల నెనలేని కృప దేవుఁ డిచ్చి యింతులలోని న్నెచ్చు జేయునటంచు ||వచ్చి||
1.  భయ మాత్మలో వీడు కన్యకా నీవు దయబొంది యున్నవు ధన్యగా రయముగ నిదిగోగ ర్భముఁ దాల్చెదవు పుత్రో దయమౌ యేసను పేర తని కిడు మంచును ||వచ్చి||
2.  అతఁడెన్నఁబడును మహాత్ముడై సర్వో న్నతుఁడైన దైవకుమారుఁడై హిత మొప్పు దేవుండు న్నతిఁ జేసి దావీదు వితత సింహాసన మతని కిచ్చునంచు ||వచ్చి||
3.  ఘనతరుఁడగు వాని రాజ్యము అంత మొనగూడ దది నిత్యపూజ్యము వనితమగు యాకోబు వంశ మెల్లపు డేలు కొను నాతఁ డనుంచుఁ దె ల్పెను దూత మరియతో ||వచ్చి||