← కీర్తనలు

105. గొల్లల గానము

రాగం: ఆనందభైరవి|తాళం: త్రిపుట

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రారె గొల్లవారలారా నేటి రాత్రి బేత్లెహేము నూర జేరి మోక్షదూత కోరి దెల్పెను క్రీస్తు వారి జాడకన్ను లారా జూతము వేగ ||రారె||
1.  పుట్టు చావులు లేనివాడఁట పసుల తొట్టిలోపలఁ బుట్టెనేడఁట ఎట్టి వారలను జే పట్టి పాపము లూడఁ గొట్టి మోక్షపుత్రోవఁ బెట్టు వాడట వేగ ||రారె||
2.  బహుకాలమాయెను వింటిమి నేడు మహికివచ్చుట కనుగొంటిమి విహితముతోడ సేవించి వత్తము మోక్ష మహితుని గని దుఃఖ రహితులమవుదము. ||రారె||