పల్లవి:
వినరే యో నరులారా వీనుల కింపు మీర మనల అక్షింప క్రీస్తు మనుజావతారుఁ డయ్యొ వినరే అనుదినమును దే వుని తనయుని పద వనజంబులు మన మున నిడికొనుచును ||వినరే||
1. నరరూపుఁ బూని ఘోర నరకుల రారమ్మని దురితముఁ బాపు దొడ్డ దొరయో మరియా వరపుత్రుఁడు కర మరు దగు క ల్వరి గిరి దరి కరి గి రయంబున ప్రభు కరుణను గనరే ||వినరే||
2. ఆనందమైన మోక్ష మందరి కియ్య దీక్ష బూని తనమేని సిలువ మ్రాను నణఁచి మృతిఁ బొందెను దీన దయా పరుఁ డైన మహాత్ముఁడు జానుగ యాగము సలిపిన తెరంగిది ||వినరే||
3. పొందుఁగోరిన వారి విందా పరమోపకారి యెంద రెందరిఁ బరమా నందపద మొందఁగఁ జేసెను అందమునన్ దన బొంది సురక్తము జిందెను భక్తుల డెందము గుందఁగ ||వినరే||
4. ఇల మాయావాదుల మాని యితఁడే సద్గురు డని తలపోసి చూచి మతి ని శ్చల భక్తిని గొలిచిన వారికి నిల జనులకు గలు ములనలరెడు ధని కుల కందని సుఖ ములు మరి యొసఁగును ||వినరే||
5. దురితము లణఁప వచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుం దర మందిరమున కరుదుగఁ జనె బిరబిర మన మం దర మా కరుణా శరనిధి చరణ మె శరణని పోదము ||వినరే||
