← కీర్తనలు

96. యేసుక్రీస్తు దేవుడు

రచయిత: ఏ.బి. మాసిలామణి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవుని నీతి ప్రతాపం భువి యేసుని సిల్వ ప్రభావం దేవుల దేవుని అపురూపం భువి యేసుని నామ స్వరూపం దేవ యెహోవ సువాక్యం -సౌభాగ్యం దైవ జనుల హృదయానందం. ||యేసుక్రీస్తు దైవ సుతుండు యేసుక్రీస్తు మనుజసుతుండు యేసుక్రీస్తు దేవుండు యేసే ప్రభువు -స్తుతిపాత్రుడు||
1.  ఆద్యంత రహిత కీర్తి అవతార శ్రమార్జన మూర్తి ఆకస రాసుల ఆదిపతి అవనీ సృజనాత్మ ప్రతీతి అఖిల ప్రపంచ ప్రదాత - అధినేత అనుదిన కృపాలిడు సుఖదాత.
2.  పాపము భయపడు నామం పాపాత్ముడు కృపగను హోమం పతితుల వెదకిన ప్రేమస్వరం పరలోక సుఖాల విహారం పాప క్షమాపణ గానం - బహు అనవరతము నిజబలిదానం. [మానం
3.  జనముల జీవాధిపతి జగమంతటి నేలెడిజ్యోతి జీవుల అంతిమ న్యాయపతి జీవాత్ములు క్రోలెడి నీతి జనన మరణ జయశీల - నరపాల జగతిని మార్చెడి శుభజ్వాల.