పల్లవి:
శ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుఁడీ కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
1. పరేశుహత సైన్యమా మీ రాజు ఈయనే కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
2. నరులారా! మీ కోసము చావును నొందెను కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
3. సర్వ జనాంగములారా! శరణ్యుఁ డీయనే కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
4. పరంబునందు యేసుకుఁ కిరీట ముంచుచు హర్షంబుతోఁ గీర్తింతుము -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
