← కీర్తనలు

95. క్రీస్తు దైవత్వము

రాగం: శంకరాభరణము|తాళం: అట|ఛాయ: దేవుడిచ్చిన దివ్య వాక్యము|రచయిత: గొల్లపల్లి నతానియేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు క్రీస్తుఁడు నిత్య దేవుఁడు ఎఱిగి నమ్ముఁడి మనుజులారా మోస మొందక మోక్షపతికిఁక దాసులై బ్రతుకండి రండి ||యేసు||
1.  ఆరు దినములలోపలనే యాకసము భూలోకములను ప్రాకటముగఁ జేసి నాఁడు ప్రకాశుఁడాయన ప్రజ్ఞవంతుఁడు ||యేసు||
2.  ఆది పురుషుని యాదిస్త్రీనిఁక హస్తములతో నంటి చేసెను మేదినిన్ ఫలవనములో న సాధులై నివసింప నిచ్చెను ||యేసు||
3.  వార లిద్దపు దేవునాజ్ఞను కోరికలతో మీరినప్పుడు గారడీ పిశాచ తంత్రము వారి పరమై పాపులైరి ||యేసు||
4.  వీరలందఱు వారి సంతతి వేరెలేరీ ధరణిలో దు ష్యార్యులై దేవుని యాజ్ఞలు మీరి రందఱు నరక పాత్రులు ||యేసు||
5.  ఇంత పాపభరితులై కా సంతసత్యము లేని నరుల నెంతగాఁ బ్రేమించెనో తన సొంత ప్రాణముఁ బలిగఁబెట్టెను ||యేసు||
6.  పాపమించుకలేని కరుణా పావనుడు నరుఁడాయెను శాపగ్రస్తులమైన మన శాపములు తాఁజేతఁ బూనెను ||యేసు||
7.  ఎన్నరాని బాధలొందుచు పుణ్యరక్తము జిందెనిలను ఎన్నఁడు నీలాటి ప్రేమ వన్నెలేదో యన్నలారా ||యేసు||
8.  మనలఁ బాపమునుండి బాపను మనుజుఁడై మరణంబునొంది మన ప్రభువె మూఁడవ దినంబున మహినిలేచి పరము వెళ్లెను ||యేసు||