కీర్తనలు

94. యేసునకు సమానులెవరు?

రాగం: శంకరాభరణము|తాళం: ఆది|రచయిత: చెట్టి భానుమూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమున్ సహించి వహించి ప్రేమించగల నీ ||సమాను||
1.  సమాన తత్వము సహోదరత్వము సమంజసము గాను మాకు దెలుప నీ ||సమాను||
2.  పరార్ధమై భవ శరీర మొసగిన పరోపకారా నరావ తారా||సమాను||
3.  దయా హృదయ యీ దురాత్ము లెల్లరిన్ నయాన భయాన దయాన బ్రోవ నీ ||సమాను||
4.  ఓ పావనాత్ముడ ఓ పుణ్య శీలుడ పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతనీ ||సమాను||