కీర్తనలు

93. యేసు దీనదయాళుడు

రాగం: మాయామాళవగౌళ|తాళం: ఆది|రచయిత: చెట్టి భానుమూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ మము బ్రోచితహో నీవే గదా మా నిజరక్షణకై జీవమీయ ధర జేరితహో||
1.  సుగుణాత్ములలో సుగుణము నీవే నిగమము లెరుగని నీతివహో సుజనాత్ముల కిల సుజ్ఞానాత్మవు సవినయ భక్తికి సారమహో||
2.  పేదలలో నిరు పేదవు నీవే సాధులలో ఘన సాధువహో మోదమలర మా ముక్తిని గూర్చిన సాధు పేదజన సోదరహో||
3.  దీనాత్ములలో దీనుడవై భవదీయ దయారస ధారలహో దినదిన మొసగిన దేవాత్మజ యిమ్మాను యేలు వం దనములహో||
4.  పరమ పూజ్యుడా పరిమిత ప్రేమాభరితుడ సంస్థవ పాత్రుడహో నిరతము నిన్నేమరక నుతిం చెద నరజన గణముల నేస్తడహో||