← కీర్తనలు

92. యేసు శరణు

రాగం: జంఝూటి|తాళం: ఆది|రచయిత: చెట్టి భానుమూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసుకు శరణం||
1.  దేవకుమారశరణం నర జీవప్రదాత శరణం దేవదేవ జగదావతారమము బ్రోవరావె ప్రభు నీవే శరణం ||
2.  పాపవినాశక శరణం నర శాపవిమోచక శరణం పావనాత్మ భవదీయ ప్రాణమిడి ప్రాపువైతివో ప్రభువా శరణం
3.  పరమపురుషుడా శరణం ఓ నిరుపమప్రేమడ శరణం మరణ మొంది మరి మృత్యుంజయుడై పరమున జరిగిన ప్రభువా శరణం||
4.  నీతిపూర్ణమా శరణం జగ జ్యోతి రత్నమా శరణం జాతిభేదరాహిత్యుడ హితుడా నీతిప్రబోధక నీవే శరణం
5.  తేజోమూర్తికి శరణం విభ్రాజిత కీర్తికి శరణం రాజరాజ యో భారత రాజ్య ప్రజాత్మ రక్షక ప్రభువా శరణం