← కీర్తనలు

72. క్రీస్తునకు మంగళార్చన

రాగం: బిలహరి|తాళం: త్రిపుట|ఛాయ: గీతములు పాడరే|రచయిత: పురుషోత్తము చౌధరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో ప్రియులారా మంగళముఁ బాడరెర్ మంగళముఁ బాడి దు స్సంగతిని వీడి ప్రభు సంగులను గూడి మదిఁ బొంగుచుఁ జెలంగుచును ||మంగళము||
1.  రాజులకు రాజని దూతలచేత పూజఁగొనువాఁడని తేజమున సూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ ||మంగళము||
2.  కరుణ గల వాఁడని పాపులఁబ్రోచు బిరుదుగొనినాఁడని మరణమును దానిఁ బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుఁడితఁదె మన పాలి వాఁడని శుభ||మంగళము||
3.  సంగీతము పాడుచు సువార్త ప్ర సంగములఁ గూడుచు నింగికిని భూమికిని నిత్యముగ నేలఁ దగు శృంగారపు రాజునకు క్షేమ మగు ఆమేనిని||మంగళము||