← కీర్తనలు

71. క్రీస్తును స్తుతించుట

రాగం: ముఖారి|తాళం: త్రిపుట

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీవు నా దేవుండవై యు న్నావు యేసు నాధ నీవిలఁ బ్రోవవే నన్నుఁ గావవే ||నీవు||
1.  పాప మానవ శాప భారము నోపి సిల్వను బడిన క్షేమా ధిపతి సర్వ భూపతి ||నీవు||
2.  శ్రేయమౌ కా యంబు భక్తుల కీయ సిద్ధముఁ జేయు యేసు నాయకా మోక్ష దాయకా ||నీవు||
3.  జీవ మారెడి త్రోవ నేఁబడి చావనై యున్నాను పతిత పావనా యాత్మ జీవనా ||నీవు||
4.  జాగుసేయక బాగుసేయను రాఁగదె నే ఘోర పాప రోగిని దఃఖ భాగిని ||నీవు||
5.  పాపమున నా రూపు మాపితి ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా కృపను జూపవా ||నీవు||