కీర్తనలు

73. క్రీస్తునకు స్తోత్రము

రాగం: తోడి|తాళం: ఆది|రచయిత: పురుషోత్తము చౌధరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి ||మంగళమే||
1.  పరమ పవిత్రునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిపుణ వద్యునకు||మంగళమే||
2.  దురిత సంహారునకు వరసుగుణోదారునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు||మంగళమే||
3.  సత్య ప్రవర్తునకు సద్దర్మశీలునకు నిత్యస్వయంజీవునకు నిర్మలాత్మునకు||మంగళమే||
4.  యుక్తస్తోత్రార్హూనకు భక్తరక్షామణికి సత్యపరంజ్యోతి యగు సార్వభౌమునకు||మంగళమే||
5.  నరఘోర కలుషముల నురుమారంగ నిల కరుదెంచిన మాపాలి వర రక్షకునకు||మంగళమే||
6.  పరమపురి వాసునకు నరదైవ రూపునకు పరమేశ్వర తనయునకు బ్రణుతింతుము నిన్ను ||మంగళమే||