← కీర్తనలు

70. దేవకుమారునికి స్తోత్రము

రాగం: శంకరాభరణము|తాళం: ఆది|రచయిత: మిక్కిలి నమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవ కుమారా దీనోపకారా నా వంక దయఁజూప నా యన్న రారా||దేవ||
1.  వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా||దేవ||
2.  పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు||దేవ||
3.  వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుఁబ్రోవవే యేసు నామావతారా||దేవ||
4.  భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవే నజరేతు వాఁడా||దేవ||
5.  కనికర మత్యంత కరుణయుఁగలదు నిను నమ్ము వాని చే తిని వీడ వలదు||దేవ||
6.  మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధ బాపవే ఇమ్మానుయేలా||దేవ||