← కీర్తనలు

69. దైవ స్తుతి

రాగం: శంకరాభరణము|తాళం: ఆది|ఛాయ: యెహోవా సన్నిధి|రచయిత: నరెళ్ల నమూయేలు సుబ్బయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఉర్వి నుత్సాహముతో గురుస్తోత్రము జేయను రండి||సర్వ||
1.  ఆ ప్రభువే దేవుండు అధికస్తోత్రార్హుండు భూప్రజలు నందరిని బుట్టించిన భగవంతుండు||సర్వ||
2.  మనము దేవుని వార మును మరి యాయన ప్రజల మనయము నా ఘనప్రభువు నెనరుతో మేపెడి గొఱ్ఱెలము||సర్వ||
3.  కృతజ్ఞతార్పణలు కొల్లగను జెల్లింప నాతని యావరణములో నతి వినయముతోఁజేరండి||సర్వ||
4.  ఆయన దయామయుఁడు ఆయన కృపామయుఁడు ఆయన ప్రేమ సత్యం బనవరతం బుండును నిజమే||సర్వ||
5.  శుభనామం మదినుంచి ప్రభునామం స్తుతియించి ఘననామం బతిభక్తిన్ అనయము గొలువుడి జనులారా||సర్వ||