← కీర్తనలు

68. ప్రభువైన యేసునకు స్తుతి

రాగం: ఆనందభైరవి|తాళం: ఆది|ఛాయ: యేసువంటి ప్రియబంధువు|రచయిత: మిక్కిలి నమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఘన భవ దుపకృతు లను మాటికి నే వినుతింతును దే నిజసుత యొనరఁగ నాపై ననుక్రోశముఁదగ నునుపవే క్రైస్తవ జన విహిత||ఘన||
1.  ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా పారముఁదప్పిన పాతకు నగు నే నారడివడ నీ కది బిరుదా||ఘన||
2.  జలబుద్బుదముతో సమ మని నాస్థితి తెలియద నీకది దేహధరా ఖలమయ మగు నీ కర్మినిఁబ్రోవను సిలువను బొందిన శ్రేయఃకరా||ఘన||
3.  మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ సు నంద నా యందముగా నా డెందము కడుఁదెలి వొందఁగ నీ దయ నందు మా ||ఘన||